మీడియాలో మహిళల రక్షణ కోసం నూతన పాలసీ : మంత్రి సీతక్క

-

మీడియా రంగంలో మహిళలను ప్రోత్సహించాలని మంత్రి సీతక్క అన్నారు. గురువారం జూబ్లీహిల్స్ లోని జర్నలిస్ట్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రాంగణంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ  కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి సీతక్క హాజరయ్యారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. మహిళల కష్టాలు తీర్చేందుకు, శ్రమ దోపిడీకి వ్యతిరేకంగా నాడు మహిళా దినోత్సవం ఆవిర్భవించిందని తెలిపారు. ఆర్థిక స్వేచ్ఛ కోసం మహిళలు ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నారని చెప్పారు. అప్పటి నుంచి ఇప్పటికి అన్ని రంగాల్లో మహిళలు వివక్ష ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మీడియాలో మహిళలపై ఉన్న వివక్షత పోవాలి వివక్షతను రూపుమాపేందుకు మన ఆలోచించే విధానాల్లో మార్పు రావాలని అన్నారు. ప్రతి ఇంట్లో ఆడవారి పట్ల గౌరవం ఇచ్చే విధంగా పిల్లలకు నేర్పించాలని, పాఠశాలల్లో గురువులు అదే విధంగా బోధించాలని సూచించారు. మహిళ పట్ల దురభి ప్రాయంతో వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మీడియాలో మహిళలపై ఉన్న వివక్షత పోవాలని, రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు కొన్ని సార్లు ఇబ్బందులకు గురవుతారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version