ఎస్సీ వర్గీకరణ వల్ల ఎవ్వరి ప్రయోజనాలకు ఇబ్బంది ఉండదు అని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణకు సంబంధించి అసెంబ్లీలో తీర్మాణం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి దామోదర మాట్లాడారు. ఓ దళితుడిని పార్టీ అధ్యక్షుడిని చేసింది కాంగ్రెస్ మాత్రమే అన్నారు. ఈ దేశంలో ఎస్సీలను మనుషులుగా చూడలేదు అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే దళితుడు అని తెలిపారు.
ఎస్సీ వర్గీకరణ అనేది ఏళ్ల నాటి కల అన్నారు. సామాజిక న్యాయం అంబేద్కర్ కల అన్నారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అని సుప్రీంకోర్టు తెలిపింది. రాజకీయ కారణాలతో నిర్ణయాలు తీసుకోకూడదు. ఎంపరికల్ డేటా ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి. జనాభా, వృత్తి, ఆర్థిక స్థితి గతులు ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలి సుప్రీంకోర్టు చెప్పింది. తెలంగాణ రా
ష్ట్ర సీఎం 1 గంట వ్యవధిలోనే ప్రకటన చేశారు. సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఉత్తమ్ చైర్మన్, దామోదర కో చైర్మన్, గౌరవసభ్యులందరం కలిసి నాలుగు సమావేశాల్లో ఏమి చేయాలని చర్చించి నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.