సామాజిక, పౌర సంబంధాల శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

-

ఎన్నికల సమీపిస్తున్న వేళ ఉద్యోగాల భర్తీపై కేసీఆర్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే చాలా నోటిఫికేషన్లను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం…. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. సమాచార మరియు పౌర సంబంధాల శాఖలో 88 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఈ పౌరుల సేవల పద్ధతిలో నియమించనున్నట్లు తెలిపింది. ప్రతి జిల్లాకు ఒక సహాయ పౌర సంబంధాల నియామకం చేపట్టాలని… అలాగే ప్రతి జిల్లాలో ఇద్దరు పబ్లిసిటీ అసిస్టెంట్లను నియమించాలని నిర్ణయించినట్లు ప్రభుత్వం తన నోటిఫికేషన్లు స్పష్టంగా పేర్కొంది.

ఇది ఇలా ఉండగా….తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అల్పాహారాన్ని అందించేందుకు ఉద్దేశించిన ‘ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ నేడు లాంఛనంగా ప్రారంభంకానుంది. రాష్ట్రంలోని ప్రతీ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో ఈ కార్యక్రమాన్ని మంత్రులు, శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులు శ్రీకారం చుట్టనున్నారు. మిగిలిన పాఠశాలల్లో దసరా సెలవుల తర్వాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version