గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులకు చుక్కలు చూపెట్టిన ఓం శ్రీ ట్రావెల్స్

-

సంగారెడ్డి జిల్లాలో గోవాకు వెళ్లాల్సిన ప్రయాణికులకు చుక్కలు చూపెట్టింది ఓం శ్రీ ట్రావెల్స్. గోవాకి వెళ్లే ఓం శ్రీ ప్రయివేటు ట్రావెల్స్ నిర్వాహకులు ఓవర్ యాక్షన్ చేసింది. నిన్న రాత్రి LB నగర్ నుంచి ప్రయాణికులను పికప్ చేసుకోవాల్సి ఉండగా అందరిని మియాపూర్ రావాలని ఆదేశించింది ఓం శ్రీ ట్రావెల్స్. దీంతో అర్ధరాత్రి మియాపూర్ లో ప్రయాణికులు ఎక్కారు. ఇదేంటని ప్రశ్నిస్తే దురుసుగా ప్రవర్తించి సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం వద్ద బస్సు ఆపేశాడు డ్రైవర్.

అనంతరం డయల్ 100 కి ఫోన్ చేస్తే పోలీసులు వచ్చి బస్సును పోలీస్ స్టేషన్ కు తరలించారు. బస్సును పోలీస్ స్టేషన్ లో వదిలేసి వెళ్లిపోయాడు డ్రైవర్. ఇక అర్ధరాత్రి నుంచి పోలీస్ స్టేషన్ ఎదుటే పిల్లపాపలతో పడిగాపులు కాస్తున్నారు ప్రయాణికులు. అదే బస్సులో ఇండియన్ కొస్ట్ గార్డు అసిస్టెంట్ కమాండెంట్ ఇంటర్వ్యూ కోసం గోవాకు వెళ్లాల్సిన చరణ్ వర్మ అనే వ్యక్తి ఉన్నారు. ఓం శ్రీ ట్రావెల్స్ పై ఆర్సీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ప్రయాణికులు. తమని ఇబ్బందులు పెట్టిన డ్రైవర్, ట్రావెల్స్ యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version