పేట్లబుర్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. డబ్బులు ఇస్తేనే చెకప్..!

-

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రుల పరిస్థితి దారుణంగా ఉంది. ముఖ్యంగా గర్బిణీ స్త్రీలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గర్భీణీలు అడ్మిట్ కావాలంటే.. ఆసుపత్రి సెక్యూరిటీ, నర్సు, వార్డు బాయ్ ఇలా చాలా మందికి లంచాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. వీరందరికీ లంచాలు ఇచ్చుకుంటూ పోతే ప్రభుత్వ ఆసుపత్రి కంటే ప్రైవేటు ఆసుపత్రినే బెటర్ అంటూ కొంత మంది పేదలు పేర్కొంటున్నారు.

తాజాగా పేట్లబుర్జ్ ఆసుపత్రిలో ఓ దారుణ ఘటన చోటు చేసుకుంది.  మహేశ్వరంకు చెందిన ఓ గర్భిణీ పురిటి నొప్పులతో పెట్లబుర్జ్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. గర్భిణీకి తీవ్ర రక్తస్రావం అవుతుందని.. నొప్పులతో బాధ పడుతుందని ఆసుపత్రి సిబ్బందికి చెప్పారు. అయితే ఆస్పత్రిలో సిబ్బంది డబ్బులు ఇస్తేనే చెకప్ రూంకి తీసుకెళ్తామని అంటున్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో లంచం తీసుకోవడం ఏంటని.. ఒకరికి ఇస్తే ఇంకొకరు అడుగుతున్నార. ఇవ్వకపోతే ఇబ్బంది పెడుతున్నారని ఆ గర్భిణీ చెల్లెలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియాకి సమాచారం ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version