మహిళా జర్నలిస్ట్, ఎన్డీటీవీ ప్రతినిధి పట్ల అనుచితంగా ప్రవర్తించారు పోలీసులు. ముఖ్యంగా ఏసీబీ ఆఫీసు వద్ద కవరేజ్ కు వెళ్లిన సమయంలో పోలీసుల తీరు ఆక్షేపనియంగా ఉంది. మహిళ అని కూడా చూడకుండా నెట్టేసిన వైనం.. మీడియా పై దాడి ఎందుకు అంటూ పోలీసులపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ బయటికి వెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ సమయంలో మీడియా అంతా ఒక్కసారిగా కేటీఆర్ వద్దకు రావడం.. విచారణలో ఏయే ప్రశ్నలు ప్రశ్నించారని అడగేందుకు మీడియా ప్రతినిధులు పోటీ పడ్డారు.
సంవత్సరం తర్వాత కూడా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అని ఎవరు గుర్తుపడ్తలేరు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఏమైనా అంటే మళ్లీ రేవంత్ రెడ్డి వాళ్ళ మీద కేసు పెడుతున్నాడు.. అందుకని నేను ఏమి అనను అన్నారు. మరోవైపు కేటీఆర్‌కు హారతి ఇచ్చి తెలంగాణ భవన్ లోపలికి ఆహ్వానించిన మహిళా నేతలు.