కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారు..అందుకే ఈ నిర్ణయం – పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

-

తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాట తప్పారు..అందుకే ఈ నిర్ణయం అంటూ పార్టీ మారడంపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్‌ కామెంట్స్‌ చేశారు. గత నాలుగున్నర సంవత్సరాలుగా నాకు ఆవేదన ఉంది. 2013 ఫిబ్రవరి 13 న రాజకీయ రంగ ప్రవేశం చేసి, ముగ్గురు శాసన సభ్యులతో పాటు పార్లమెంటు ను గెలిపించానని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చిన మెజారిటీ స్థానాలు గెలిపించుకున్నా..రెండున్నరా యేళ్ల తర్వాత టిఆర్ఎస్ పార్టీకి ఆహ్వానం మేరకు వెళ్లానని వెల్లడించారు.

టిఆర్ఎస్ లో నాతో పాటు నా ఫాలోవర్స్ ఒక్కరికి పదవులు ఇప్పించుకోలేక పోయాను…2018 లో నా ఫాలోవర్స్ కు టికెట్ దక్కలేదని ఆగ్రహించారు. 2019 ఎన్నికల్లో ఒక పార్టీకి రాష్ట్రాధ్యక్షుడిగా ఉన్న నాకు టికెట్ ఇవ్వలేదు…పదవులు ఇవ్వక పోయిన కాని కేసిఆర్ మాటలకు విలువ ఇచ్చి పార్టీలో కొనసాగానని తెలిపారు. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా గెలిపించి పార్లమెంటు కు పంపుతామని అభిమానులు ఒత్తిడి తెచ్చిన కాని నేను పార్టీ లైన్ దాటలేదు.. ఏ వ్యక్తికైన ఆత్మ గౌరవం ఉంటుంది. నాకు ఆత్మాభిమానం ఉందన్నారు. పోడు భూముల సమస్యను పరిష్కారం చేస్తానని కేసిఆర్ మాట తప్పారు..గడిచిన 4 యేళ్లుగా ప్రజల గుండెల్లో ఉండాలని భావిస్తూ పర్యటిస్తూ వచ్చానని వివరించారు. రానున్న కాలంలో మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నానని తెలియజేశారు పొంగులేటి.

Read more RELATED
Recommended to you

Exit mobile version