మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి చిట్టా విప్పారు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమ. కరీంనగర్ బిజెపి కార్యాలయంలో బిజెపి తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి రాని రుద్రమ మాట్లాడుతూ…. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అవినీతి మంత్రిగా ఘనత ఉందని.. అసెంబ్లీ ఎన్నికల ముందు మామూలు కారులో తిరిగిన మంత్రి పొన్నం ప్రభాకర్కు ఇప్పుడు కోటి 50 లక్షల టయోటా వెల్ ఫైవ్ కారులో తిరుగుతున్నారని ఫైర్ అయ్యారు.
ఒక ప్రైవేటు ట్రావెల్స్ యజమాని గిఫ్టుగా ఇచ్చిన కోటి 50 లక్షల కారు ఆధారాలతో నిరూపిస్తానని.. జాతీయ సంపదగా రామగుండం బూడిది కర్మాగారంలో రోడ్ల నిర్మాణం కొరకు తరలిస్తున్న బూడిది లారీలను ఆపి రెండు కోట్ల రూపాయల డిమాండ్ చేసినట్లు చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న ఎంపీ ఎలక్షన్లలో రోహిత్ రావుకు టికెట్ ఇస్తానని రెండు కోట్లు ఖర్చుపెట్టి ఇచ్చి పెట్టి ఇప్పుడు ఐదు కోట్లు తీసుకుని వెలిచాల రాజేంద్ర రావుకి ఇప్పించాడని ఆరోపణలు చేశారు. కరీంనగర్ అసెంబ్లీ ఎన్నికలలో టిఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ తో ములకతై గంగుల కమలాకర్ ను గెలిపించేందుకు హుస్నాబాద్ వెళ్లి గెలిచాడని పొన్నం పై ఆరోపణలు చేశారు. జర్నలిస్టుల ఫ్లాట్ల కేటాయింపులో కూడా అడ్డంకులు చేస్తూ జర్నలిస్టులను ఇబ్బందుల గురి చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.