ఆత్మహత్య చేసుకున్న రోజే..ప్రీతి చనిపోతుందనుకున్నా – ప్రీతి తండ్రి నరేందర్

-

ఆత్మహత్య చేసుకున్న రోజే..ప్రీతి చనిపోతుందనుకున్నా అంటూ ప్రీతి తండ్రి నరేందర్ అవేదన వ్యక్తం చేశాడు. ప్రీతి మృత దేహం ఆమె స్వగ్రామానికి చేరింది. ఈ నేపథ్యంలో ప్రీతి తండ్రి నరేందర్ మాట్లాడుతూ.. సంఘటన జరిగిన రోజే నా బిడ్డను చూసి ప్రాణాలు దక్కవని అనుకున్నానని చెప్పారు.

నన్ను ఇన్ని రోజులు మభ్య పెట్టారని.. ట్రీట్ మెంట్ పేరు తో నన్ను నా కుటుంబాన్ని మభ్య పెట్టారని ఆగ్రహించారు. ఇలా జరుగుతుందని అనుకోలేదు… గిర్ని తండాతో పాటు మొండ్రాయి గ్రామాల్లో డాక్టర్ అయిన మొదటి అమ్మాయి ప్రీతి అని తెలిపారు. ఎంతో గర్వంగా ఉండేదని… ప్రీతిని చూసి మిగిలిన గ్రామంలోని యువతను ఆదర్శంగా తీసుకోవాలని చెప్పేవాళ్ళమని వెల్లడించారు. కానీ ఇలా జరుగుతుందని ఊహించలేదు… వేధింపులకు గురిచేసిన సైఫ్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు ప్రీతి తండ్రి నరేందర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version