కుర్చీలోనే గర్భిణీ డెలివరీ.. మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన ట్వీట్..!

-

నల్గొండ జిల్లా కేంద్ర ప్రభుత్వ దవఖాన లోని మాతాశిశు సంరక్షణ కేంద్రంలో శుక్రవారం తెల్లవారుజామున 3.56 గంటలకు కుర్చీలోనే మహిళ ప్రసవించిన విషయం తెలిసిందే. ఈ ఘటన పై మాజీ మంత్రి హరీశ్ రావు స్పందించారు. రాష్ట్రంలో వైద్య ఆరోగ్యశాఖ నిర్లక్ష్యం పేద ప్రజలకు శాపంగా మారింది. బీ ఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హాస్పటల్లో ఘనతను చాటేలా వార్తలు వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఆసుపత్రుల అధ్వాన్న పరిస్థితుల గురించి రోజూ వార్తలు వస్తున్నాయి.

“పడకేసిన ప్రజారోగ్యం, రోగుల మందులు ఎలుకల పాలు, కుర్చీలోనే గర్భిణీ డెలివరీ, ఒకే బెడ్ పై ముగ్గురికి ట్రీట్మెంట్” ఇవన్నీ ఈ ఒక్క రోజు పత్రికల్లో వైద్య ఆరోగ్యశాఖపై నిర్వాకంపై వచ్చిన వార్తా కథనాలు. ప్రజారోగ్య సంరక్షణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వా నిర్లక్ష్య వైఖరికి ఇది నిదర్శనం. వానాకాలం వస్తున్నప్పటికీ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం ఆస్పత్రుల సన్నధ్ధతపై సమీక్షలు నిర్వహించకపోవడం పారిశుధ్యాన్ని పట్టించుకోకపోవడం వల్ల మలేరియా, డెంగీ లాంటి సీజనల్ రోగాలు విజృంభిస్తున్నాయి. గడచిన నెలన్నర కాలంలో 5246 డెంగీ కేసులు నమోదయ్యాయి. గత సంవత్సరంతో పోలిస్తే 36% డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని అధికారిక లెక్కలు తెలుపుతున్నాయని పలు విషయాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు హరీశ్ రావు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version