నల్గొండ ఎంపీగా రఘవీర్ రెడ్డి భారీ విజయం.. తెలుగు రాష్ట్రాల్లో రికార్డు

-

తెలుగు రాష్ట్రాల పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో నల్గొండ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి రికార్డు విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డిపై 5.52 లక్షల భారీ మెజారిటీతో రఘువీర్ గెలిచారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక మెజార్టీ సాధించిన ఎంపీగా రికార్డు సృష్టించారు. ఇంతకుముందు 2011లో కడప లోక్ సభ ఉప ఎన్నికలో వైఎస్ జగన్ 5.43 లక్షల ఆధిక్యం సాధించారు. ఇప్పుడు ఆ రికార్డును రఘువీర్ అధిగమించారు.

బీఆర్ఎస్ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించకపోవడం గమనార్హం. దాదాపు పదేళ్లపాటు అధికారంలో ఉండి.. ఇటీవల ఓడిపోయిన బీఆర్ఎస్ కి లోక్ సభ ఎన్నికల్లో కూడా విజయం సాధించడానికి కష్టతరమైంది.  మొత్తం 17 లోక్ సభ స్థానాల్లో కాంగ్రెస్ ఎనిమిదింట్లో విజయం సాధించింది. బీజేపీ 8 స్థానాల్లో విజయం సాధించింది. ఎంఐఎం  అభ్యర్థి  అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించారు.  కొన్ని రౌండ్ల వరకు మెదక్ లోక్ సభ స్థానం నుంచి బీఆర్ఎస్  గట్టి పోటీనిచ్చినా మళ్లీ వెనుకంజలోనే ఉండింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version