BREAKING : బీజేపీలో ముసలం.. ఢిల్లీకి రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డి

-

BREAKING : తెలంగాణ రాష్ట్ర బీజేపీలో ముసలం నెలకొంది. తాజాగా ఢిల్లీకి రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డి పయనం అయ్యారు. ఢిల్లీకి రావాలని బీజేపీ అధిష్టానం రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలకు ఆదేశాలు ఇవ్వడంతో.. వారుద్దరూ పయనం అయ్యారు. గత కొన్నిరోజులుగా బీజేపీ ఉంటూనే.. ఆ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ.. అలజడి సృష్టిస్తున్నారు రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలు.

అలాగే.. వీరు పార్టీ మారుతారనే వార్తలు కూడా వచ్చాయి. ఈ తరుణంలోనే..రఘునందన్ రావు, కొండ విశ్వేశ్వర్ రెడ్డిలను ఢిల్లీకి పిలుపుపించుకుంది బీజేపీ అధిష్టానం. ఇక అటు బీజేపీలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముంబైకి బండి సంజయ్‌ వెళ్లారు. అధ్యక్ష పదవి రెండు మూడు రోజుల ముచ్చటే అంటూ సన్నిహితుల వద్ద సంజయ్‌ వ్యాఖ్యలు చేశారు. వరంగల్‌ మోడీ మీటింగ్‌కు అధ్యక్ష హోదాలో హాజరవుతానో లేదో అంటూ బండి సంజయ్‌ అన్నారు. ఈ తరుణంలోనే ముంబాదేవిని దర్శించుకుని అక్కడ నుంచి ఢిల్లీకి సంజయ్‌ పయనం కానున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version