తెలంగాణలో రైతుల సర్కార్ తీసుకొస్తాం : రాహుల్ గాంధీ

-

తెలంగాణలో అధికారంలోకి వచ్చి తీరుతామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే మహిళల ఖాతాల్లో ప్రతి నెలా రూ.2,500 వేస్తామని తెలిపారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం రాగానే రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ అందిస్తామని.. రాష్ట్ర పరిధిలో మహిళలు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. అధికారం రాగానే రాష్ట్రంలో కులగణన చేపడతామని చెప్పారు. తెలంగాణలో పేదలు, రైతుల సర్కార్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

“పార్లమెంట్‌లో కులగణనపై నేను మాట్లాడాను. దేశంలో కేవలం ఐదు శాతం అధికారులు మాత్రమే బడ్జెట్‌ను నియంత్రిస్తున్నారు. అందరినీ పరిపాలనలో భాగస్వామ్యం చేస్తేనే దేశం అభివృద్ధి చెందుతుంది. అదానీ రూ.లక్షల కోట్లు అప్పు తీసుకుంటారు. అదానీ తీసుకున్న అప్పులను బీజేపీ మాఫీ చేస్తుంది. స్వయం ఉపాధి రుణాలను మాత్రం మాఫీ చేయదు. ప్రజలు కొనే ప్రతి వస్తువుపై జీఎస్టీ వసూలు చేస్తుంది. ప్రజల నుంచి పన్నుల వసూలు చేసి అదానీకి కట్టబెడుతున్నారు. బీజేపీ ప్రభుత్వం రైతుల రుణాలు ఎందుకు మాఫీ చేయదు?” అని రాహుల్ ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version