మంత్రి కొండా సురేఖ పై రాహుల్ గాంధీ సీరియస్..!

-

తెలంగాణలో మంత్రి కొండా సురేఖ పై సోషల్ మీడియాలో కొద్ది రోజుల కిందట ట్రోల్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే కొండా సురేఖను ట్రోలింగ్ చేసింది బీఆర్ఎస్ నేతలేనని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక మహిళా పై ఇలా ట్రోలింగ్స్ చేయడం కరెక్ట్ కాదన్నారు. హరీశ్ రావు కూడా స్పందించారు. అయితే కేటీఆర్ స్పందించకపోవడంతో కేటీఆర్-కొండా సురేఖ మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఈ మాటల యుద్ధంలో భాగంగా కేటీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సినీ ఇండస్ట్రీకి చెందిన నాగచైతన్య-సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు. అలాగే ఎంతో మంది హీరోయిన్ల జీవితాలను నాశనం చేశాడని.. కొంత మంది కేటీఆర్ కారణంగా త్వరగా పెళ్లి చేసుకున్నారని ఆరోపించింది. దీనిపై నాగార్జున నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు. మరో వైపు కేటీఆర్ కూడా పరువు నష్టం దావా వేశారు. ఈ వివాదంతో కాంగ్రెస్ అధిష్టానం కొండా సురేఖ పై సీరియస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి కొండా సురేఖతో ఫోన్ లో మాట్లాడినట్టు సమాచారం. అలాగే సమంత పై చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ వివరణ కోరారు. రాహుల్ గాంధీకి లేఖ రాశారు కొండా సురేఖ. రాహుల్ గాంధీ లేఖ చూసిన తరువాత ఢిల్లీ నుంచి రియాక్షన్ ఉండే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version