తెలుగు రాష్ట్రాలకు కూల్ న్యూస్ చెప్పింది వాతావరణ శాఖ. వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనాలకు ఉపశమనం కలిగిలా గుడ్ న్యూస్ చెప్పింది. రానున్న 5 రోజుల పాటు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్న సమయంలో వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడనుంది. తెలంగాణలో ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ లోని ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదువుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు కురిస్తే వాతావరణం చల్లబడి ఎండల తీవ్రత తగ్గే అవకాశం ఉంది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఫలితంగా తెలంగాణలో ఐదు రోజులు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. విదర్భ నుంచి తెలంగాన మీదుగా ఏర్పడిన ఉపరితల ద్రోణి బలహీన పడిందని వెల్లడించింది. దీని వల్ల తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది.