తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదు: రేణుకా చౌదరి

-

తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులపై ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి. రాష్ట్రంలో అరాచకాలు ఎక్కవయ్యాయని ఆమె వ్యాఖ్యానించారు. తెలంగాణలో శాంతి భద్రతలు క్షీణిస్తుంటే కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదంటూ ప్రశ్నించారు. ప్రజల్ని పోలీసుల ఇబ్బందులు పెడుతుంటే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎందుకు సైటెంట్ ఉంటున్నారు.. వెంటనే స్పెషల్ టీంలను ఎందుకు పంపించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని ఆరోపించారు. వెంటనే కేంద్ర టీంలను పంపించాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారని… వారి వల్ల కొంతమంది మంచి పోలీసులు కూడా పనిచేసే పరిస్థితి లేదంటూ వ్యాఖ్యానించారు. ప్రజల నుంచి కేంద్రం ఫిర్యాదులను స్వీకరించాలని డిమాండ్ చేశారు.

ఇటీవల పోలీసులు, టీఆర్ఎస్ లీడర్ల వేధింపులతో ఖమ్మం జిల్లాలో బీజేపీ కార్యకర్త ఆత్మహత్య చేసుకున్నారు. ఇదే విధంగా కామారెడ్డి జిల్లాలో తల్లి, కుమారుడు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరెండు ఘటనపై ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ నేతలతో పాటు పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ రెండు ఘటనల నేపథ్యంలో రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news