రోహిత్ శర్మ రికార్డును సమం చేసిన డేవిడ్ వార్నర్

-

డేవిడ్ వార్నర్ ఐపీఎల్ లో అదరగొడుతున్నాడు. సన్ రైజర్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ కు వెళ్లిన తర్వాత వరసగా కీలక ఇన్సింగ్స్ ఆడుతున్నాడు. ఇప్పటికే సన్ రైజర్స్ ఫ్యాన్స్ వార్నర్ ను వదులుకోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ తరుపున ఆడుతున్న వార్నర్ తన విధ్వంసక ఇన్నింగ్స్ తో అదరగొడుతున్నారు. 

ఇదిలా ఉంటే తాజా వార్నర్ ఖాతాలో మరో రికార్డ్ చేరింది. నిన్న ఎస్ ఆర్ హెచ్ తరుపున ఆడిన మ్యాచులో హైదరాబాద్ బౌలింగ్ కు చుక్కలు చూపించాడు. 92 రన్స్ తో చివరి వరకు నాటౌట్ గా నిలిచారు. కీలక ఇన్నింగ్స్ ఆడటంతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు వార్నర్ ను వరించింది. ఇప్పటి వరకు ఐపీఎల్ లో 18 సార్లు వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకున్నాడు. దీంతో రోహిత్ శర్మ రికార్డును సమం చేశారు. వార్నర్, రోహిత్ శర్మలు ఇప్పటి వరకు 18 సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను అందుకున్నారు. ఈ జాబితాలో  25 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు అందుకుని డివిలియర్స్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తరువాతి స్థానంలో 22 సార్లు మ్యాన్ ఆప్ ది మ్యాచ్ అందుకుని క్రిస్ గేల్ రెండో స్థానంలో ఉన్నారు. వార్నర్, రోహిత్ శర్మలు ఇద్దరు మూడో స్థానంలో నిలిచారు.

Read more RELATED
Recommended to you

Latest news