కాంగ్రెస్‌లో సీట్ల లొల్లి..సీనియర్ల రచ్చ..రేవంత్‌కు తలనొప్పి!

-

కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి లొల్లి లేకపోతే ఆశ్చర్యపోవాలి గాని..ఏదైనా రచ్చ జరిగితే ఆశ్చర్యపోనవసరం లేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏదొక రచ్చ జరుగుతూనే ఉంటుంది. ఇప్పటికే కొందరు సీనియర్ నేతలు, రేవంత్ రెడ్డి మధ్య గ్యాప్ ఉన్న విషయం తెలిసిందే. వారి మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. సీనియర్ల వర్గం వర్సెస్ రేవంత్ వర్గం అన్నట్లు రాజకీయం మారిపోయింది. దీంతో ఎక్కడొక చోట రచ్చ జరుగుతూనే ఉంది.

ఇదే క్రమంలో తాజాగా కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో విభేదాలు మొదలయ్యాయి. తాజాగా అక్కడ రేవంత్ రెడ్డి పాదయాత్ర జరుగుతున్న విషయం తెలిసిందే. పాదయాత్ర వేదికగానే ఎల్లారెడ్డి నేతల మధ్య రచ్చ మొదలైంది. ముఖ్యంగా సీటు విషయంలో పెద్ద పంచాయితీ నడుస్తోంది. ఎల్లారెడ్డి సీటు కోసం పంచాయితీ నడుస్తోంది. ఈ సీటు కోసం ఓ వైపు మదన్ మోహన్,మరో వైపు సుభాష్ రెడ్డి ట్రై చేస్తున్నారు. అయితే ఈ సీటు సుభాష్ రెడ్డికే దక్కుతుందని రేవంత్ హింట్ ఇచ్చారు. దీంతో మదనమోహన్ వర్గం సీరియస్ గా ఉంది.

పాదయాత్రకు కూడా దురమైంది. తాజాగా పాదయాత్రలో షబ్బీర్ అలీ కామారెడ్డి, ఎల్లారెడ్డి సీట్ల గురించి మాట్లాడారు. రెండు నియోజకవర్గాలని తానే చూసుకుంటానని చెప్పారు. ఇక కామారెడ్డిలో అలీ, ఎల్లారెడ్డిలో సుభాష్ రెడ్డి పోటీ చేయడానికి రెడీ అయ్యారు. కానీ ఎల్లారెడ్డి సీటుపై మదన్ కన్నేశారు. గత ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో ఓడిపోయిన మదన్..అప్పటినుంచి యెల్లారెడ్డి సీటు కోసం ట్రై చేస్తున్నారు.

ఇక మదన్‌కు అజారుద్దీన్ సపోర్ట్ ఉంది. ఇటు సుభాష్ రెడ్డికి రేవంత్ సపోర్ట్ ఉంది. దీంతో ఎల్లారెడ్డిలో సీటు పంచాయితీ నడుస్తోంది. ఇక సీటు ఎవరికి దక్కుతుందో గాని ఈ రచ్చ వల్ల కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగేలా ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version