నేడు సికింద్రాబాద్‌-విశాఖ మధ్య రెండో వందేభారత్‌ రైలు ప్రారంభం

-

తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందే భారత్ రైలు పరుగు పెట్టనుంది.  సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య రెండో వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఈరోజు నుంచి పట్టాలెక్కనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వర్చువల్గా జెండా ఊపి ప్రారంభిస్తారు. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య 6 రోజుల పాటు నడుస్తుంది. వారంలో ఒక్క గురువారం రోజు మాత్రం మినహాయింపు ఉంటుంటుందని ఆ రోజు వందేభారత్ ఎక్స్ ప్రెస్ అందుబాటులో ఉండదని రైల్వే శాఖ వెల్లడించింది.

ప్రస్తుతం నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్  రెండు తెలుగు రాష్ట్రాలను కలుపుతూ 100శాతం కంటే ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన ఉండడంతో సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య ఇప్పటికే కొనసాగుతున్న వందేభారత్ ఎక్స్ ప్రెస్కు అదనంగా మరో వందేభారత్ ఎక్స్ ప్రెస్ను నడిపించాలని నిర్ణయించారు. రెండో వందేభారత్ ఎక్స్ ప్రెస్  టిక్కెట్ల బుకింగ్స్ నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version