బీజేపీకి షాక్.. బాబు మోహన్ రాజీనామా..!

-

సినీ నటుడు, మాజీ మంత్రి బాబు మోహన్ బీజేపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. పార్టీలోని తాజాగా పరిస్థితుల్లో అసంతృప్తికి గురైన ఆయన పార్టీ నుంచి తప్పుకోవాలని నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకి వెల్లడించారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. గత కొంత కాలంగా పార్టీలో ఇమడలేకపోయిన పరిస్థితుల్లో పూర్తిగా ఆ పార్టీకి గుడ్ బై చెప్పే నిర్ణయాన్ని తీసుకున్నారు. 

అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఆ తరువాత టికెట్ కేటాయించడంతో ఆయన బీజేపీ నుంచి పూర్తిగా తప్పుకునేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం. బీజేపీ టికెట్ అసెంబ్లీ ఎన్నికల్లో తన కుమారుడికి కేటయించనున్నారని టాక్ వినిపించింది. ఇంతలోనే బాబు మోహన్ పేరు ప్రకటించడంతో అంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఏది ఏమైనప్పటికీ బీజేపీ పై కాస్త గుర్రుగా ఉన్న బాబు మోహన్ మొత్తానికి ఆ పార్టీ నుంచి బయటికి వెళ్లేందుకు తాజాగా రాజీనామా చేశారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version