టెట్ అభ్యర్థులకు షాక్..పరీక్ష కేంద్రాలు బ్లాక్ !

-

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) కోసం పరీక్ష కేంద్రాల ఎంపికకు అవకాశం నిలిచిపోయింది.నగరం నుండి అంచనాలకు మించి దరఖాస్తులు వస్తుండడంతో పరీక్ష కేంద్రాల జాబితా నుండి గ్రేటర్ జిల్లాలు తొలగింపునకు గురయ్యాయి.దరఖాస్తులు సమర్పించేందుకు మరో రెండు రోజులే గడువు ఉండగా హైదరాబాద్- రంగారెడ్డి- మేడ్చల్ జిల్లాల్లొ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు అవకాశం లేకుండా బ్లాక్ అయింది.టెట్ పరీక్ష ఎంతమంది ఎంతమంది రాస్తారు అన్న అంశంపై సంబంధిత అధికారులు సరిగా అంచనా వేయలేకపోయారు.టెట్ పరీక్ష కోసం గత నెల 26 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా..ఈ నెల 12 తో గడువు ముగియనుంది.

ఫీజు చెల్లింపునకు మాత్రం నేటితో( సోమవారం) ఆఖరి రోజు పరీక్షకు హాజరయ్యేందుకు ఆన్ లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా, సర్వర్ సమస్య, నెట్ సెంటర్లలో రద్దీ తదితర కారణాలతో నెలాఖరులో దరఖాస్తు చేసుకోవచ్చని భావించిన వారికి, ఇప్పటికే ఫీజు చెల్లించి అప్లికేషన్ పూర్తి చేయని వారికి సైతం షాక్ తగిలినట్లయింది.హైదరాబాద్ పరిధిలో సుమారు లక్షమందికి పైగా బిఎడ్, డిఎడ్ కోర్సులు పూర్తి చేసిన, చేస్తున్న అభ్యర్థులు ఉన్నట్లు అంచనా.దీంతో కొత్త, పాత వారితో కలిపి దరఖాస్తుల సంఖ్య ఎగబాకుతున్నట్లు తెలుస్తోంది.పోటీపరీక్షలకు నగరంలో కోచింగ్ తీసుకుంటున్న అభ్యర్థులు సైతం టెట్ పరీక్ష కోసం ఇక్కడి కేంద్రాలను ఎంపిక చేసుకోవడంతో ఊహించిన దాని కంటే అధికంగా దరఖాస్తులు నమోదవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version