తెలంగాణ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. దీంతో 10 రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. నిరంతర వర్షాల నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే పరిధిలో పది రైళ్ల రద్దు చేసింది. మరో రెండు రైళ్లు పాక్షికంగా రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
సికింద్రాబాద్ ఉందనగర్ ప్యాసింజర్, సికింద్రాబాద్ ఉందా నగర్ మెము సర్వీస్, మేడ్చల్ ఉందా నగర్, ఉందా నగర్ సికింద్రాబాద్ స్పెషల్, సికింద్రాబాద్ ఉందనగర్ సికింద్రాబాద్ స్పెషల్, నాందేడ్ మేడ్చల్ నాందేడ్ స్పెషల్, సికింద్రాబాద్ మేడ్చల్, మేడ్చల్ సికింద్రాబాద్, కాకినాడ సికింద్రాబాద్ కాకినాడ, విజయవాడ బిట్రగుంట విజయవాడ మధ్య రైళ్లు రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే.
కాగా…గత కొన్ని రోజులుగా భారీ వర్షాలు తడిసి ముద్దవుతో ఉన్న తెలంగాణ రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. ఇప్పటికే ప్రకటించిన వాతావరణ శాఖ ఇవాళ మరియు రేపు కూడా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని చెబుతోంది.