బీజేపీ నుంచి సోయం బాపురావు సస్పెండ్ ?

-

బీజేపీ నుంచి సోయం బాపురావు సస్పెండ్ అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించే వరకు పోరాటం చేస్తానని అదిలాబాద్ బీజేపీ ఎంపీ సోయం బాపురావు ఇటీవలే పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే.. సోయం బాపురావు వ్యాఖ్యలతో బీజేపీ నాయకుడు రవీంద్ర నాయక్ సహా భగ్గుమన్నారు లంబాడీ విద్యార్థులు, గిరిజనులు.

సోయం బాపురావును బీజేపీ నుంచి సస్పెండ్ చేయాలంటూ దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు. అటు BJP MP సోయం బాపురావుపై కిషన్ రెడ్డి సీరియస్ అయ్యారు. లంబాడాలను..ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని.. నాలుగు రోజుల కిందట సోయం బాపురావు అన్న వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. సోయం బాపు రావు చేసిన వ్యాఖ్యలు..ఆయన వ్యక్తిగతం అంటూ కామెంట్స్‌ చేశారు. ఆయన ఎందుకు అలా మాట్లాడారో వారి వివరణ తీసుకుంటామని స్పష్టం చేశారు. లంబాడా సామాజిక వర్గానికి విజ్ఞప్తి చేస్తున్నాం.. పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు… వారి రిజర్వేషన్ లకు కట్టుబడి ఉన్నామని ప్రకటించారు కిషన్‌ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version