నిండుకుండలా శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు.. 21 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

-

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత మూడ్రోజులు భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా సోమ, మంగళ వారాల్లో ఎడతెరిపి లేకుండా కురిసిన వాన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగించింది. ప్రజలంతా ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నారు. చాలా గ్రామాలు నీటమునిగాయి. మరోవైపు పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. భారీ వర్షానికి వచ్చిన వరద ప్రవాహంతో జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 89,094 క్యూసెక్కులు ఉండగా.. 21 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేస్తున్నారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు ప్రస్తుత, పూర్తి నీటిమట్టం 1091 అడుగులుగా ఉందని అధికారులు తెలిపారు. మరోవైపు సాగర్​లో ప్రస్తుత, పూర్తి నీటినిల్వ 90 టీఎంసీలుగా ఉందని వెల్లడించారు.

మరోవైపు కామారెడ్డిలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. జిల్లాలోని నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టులోకి 46 వేల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. ఆరు గేట్లు ఎత్తి 46 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 1,405 అడుగులకు.. ప్రస్తుత నీటిమట్టం 1404.5 అడుగులు ఉంది. ప్రాజెక్టు పూర్తి నీటినిల్వ 17.8 టీఎంసీలకు గానూ.. ప్రస్తుతం 17 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version