తెలంగాణ విద్యార్థులకు శుభవార్త.. ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు

-

తెలంగాణ విద్యార్థులకు శుభవార్త. ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ పదవ తరగతి ప్రధాన పరీక్షలు నిన్నటితో ముగిసాయి. ఈ పరీక్షలు ముగియడంతో విద్యార్థులకు సెలవులు ప్రారంభం అయ్యాయి.

మే 31వ తేదీ వరకు సెలవులు ఉండగా…. జూన్ ఒకటో తేదీ నుంచి 2023- 24 ఇంటర్ అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుంది. ఆ రోజు నుంచే ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ క్లాసులు ప్రారంభం కానున్నాయి. ఇక పదవ తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం రేపటి నుంచి ఈ నెల 21 వరకు జరగనుంది. ఇక మే పదవ తేదీన పదవ తరగతి ఫలితాలు వెలువడే ఛాన్స్ ఉందని సమాచారం అందుతుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version