తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో సారి జాతీయ స్థాయిలో మెరిసింది. తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కు జాతీయ స్థాయిలో అజాదీ కా అమృత్ మహోత్సవ్ భాగంగా తెలంగాణకు ఏకంగా 19 అవార్డులు వచ్చాయి. కేంద్ర పంచాయతీ రాజ్ శాఖ దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయత్ సశక్తీరణ్ అవార్డులను ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఉన్న స్థానిక సంస్థల్లో మెరుగ్గు రాణించే వాటికి అవార్డులు ఇస్తారు.
ఉత్తమ గ్రామ పంచాయతీ, ఉత్తమ మండలం, ఉత్తమ జిల్లా పరిషత్ మూడు విభాగాల్లో తెలంగాణ మెరిసింది. ఈ మూడు విభాగాల్లో కలిసి మొత్తంగా తెలంగాణ రాష్ట్రానికి 19 అవార్డులు దక్కాయి. ఉత్తమ జిల్లా పరిషత్ గా రాజన్న సిరిసిల్లా నిలిచింది. కాగ ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ లలో అన్ని రంగాల్లో రాణించి.. మెరుగైన సేవాలను అందిస్తే.. వాటిని కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తుంది. అనంతరం ఆయా పరిషత్ లకు గ్రామ పంచాయతీలకు ఉత్తమ అవార్డులను ఇస్తుంది.