తెలంగాణతో పాటే ఏపీ ఎన్నికలు.. డిసెంబర్ 15న పోలింగ్ ?

-

 

 

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే… ఈసారి తెలంగాణా తో పాటు ఆంధ్రప్రదేశ్ లోను ఒకే సారి 2023 ఎన్నికలు జరగనున్నట్లు సమాచారం అందుతుంది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ సంవత్సరం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ముందస్తు ఎన్నికలకు వెళదామని ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగానే… తెలంగాణ మరియు ఏపీ ఎన్నికలు ఒకేసారి జరగనున్నట్లు విశ్వసనీయ సమాచారం.

ఒకవేళ ఇదే జరిగితే…నవంబర్ 18 నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలు కానుందని తెలుస్తోంది. అలాగే..నామినేషన్ ఉపసంహారణ తేది నవంబర్ 28 గా ఉండనుంది. పోలింగ్ డేట్ డిసెంబర్ 15 కానుండగా… డిసెంబర్ 19వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఇక డిసెంబర్ 23 న AP కి నూతనంగా ఎన్నికైన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. తేదీలు కొంచం అటు ఇటు కానీ కచ్చితంగా ఈ సంవత్సరము తెలంగాణా తో పాటుగా AP లో ఎన్నికలు జరగబోతున్నాయని చెబుతున్నారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version