తెలంగాణలో యాసంగి కొనుగోళ్లు పూర్తి.. 65.82లక్షల టన్నుల ధాన్యం సేకరణ

-

ఓవైపు అకాల వర్షాలకు పంటంతా పొలంలోనే నేలకొరగడం.. మరోవైపు ధాన్యమంతా కల్లాల్లోనే నీటిపాలవ్వడం.. ఇదంతా దాటుకుని కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే.. లారీల కొరత.. అంతలోనే మళ్లీ అకాల వర్షం.. మిగిలిన ధాన్యం కూడా నీటిపాలు.. ఇలా అడుగడుగునా తెలంగాణ రైతులు ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్ల విషయంలో అష్టపష్టాలు పడ్డారు. ఎట్టకేలకు రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోల్లు ముగిశాయి.

రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు దాదాపు ముగిసినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ ప్రకటించారు. వందసెంటర్లలో మాత్రమే అక్కడక్కడ కొనుగోళ్లు జరుగుతున్నట్లు చెప్పారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి… ఓపీఎంఎస్​లో నమోదైన ప్రతి రైతు ఖాతాకు డబ్బు బదిలీ చేసినట్లు మంత్రి గంగుల చెప్పారు. సోమవారం ఒక్కరోజే 1500కోట్లు విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఇప్పటివరకు రైతుల ఖాతాలకు 11వేల 4వందల 44 కోట్లు….బదిలీ అయినట్లు గంగుల వివరించారు. 11 లక్షల 10వేల మంది రైతుల నుంచి….65.82లక్షల టన్నుల ధాన్యం సేకరించినట్లు తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కూడా సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టినట్లు గంగుల వివరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version