తెలంగాణ రైతులకు అలర్ట్..నిన్న ఒక్కరోజే రూ.41 వేల వరకు రైతు రుణాల చెల్లింపు

-

 

మొన్న రుణమాఫీ చేస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే… నిన్న ఒక్క రోజే రూ.41 వేల వరకు రైతు రుణాలు చెల్లింపులు చేసింది ప్రభుత్వం. సీఎం కేసీఆర్‌ మాట ప్రకారం నిన్న రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్యన ఉన్న రుణాలు మాఫీలు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు రూ.167.59 కోట్లు చెల్లింపుల కోసం ఆర్థికశాఖ నుంచి విడుదల చేశారు. దీంతో 44,870 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఇక దీనిపై హరీష్‌ రావు ఎమోషనల్‌ ట్వీట్‌ చేశారు.

రైతుల‌ సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అన్నదాతలను ఆర్థికంగా మరింత బలోపేతం చేసే లక్ష్యంతో రైతు పక్షపాతి సీఎం శ్రీ కేసీఆర్ గారు రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టారున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు మొత్తం రుణమాఫీ కి సంబంధించి రూ.18,241 కోట్లకు ఆర్థిక శాఖ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ (బీఆర్వో) విడుదల చేసింది. మొదటి విడత లో భాగంగా రూ.37 వేల నుండి రూ.41 వేల మధ్య ఉన్న రైతు రుణాలను మాఫీ చేసేందుకు ఆర్థికశాఖ గురువారం రూ.237.85 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. దీని ద్వారా 62,758 మంది రైతులకు లబ్దిచేకూరనుంది. బీఆర్ఎస్ అంటే భారత రైతు సంక్షేమ పార్టీ అని మరోసారి నిరూపితం అయ్యిందన్నారు హరీష్‌ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version