NIA మోస్ట్ వాంటెడ్ జాబితాలో తెలుగు రాష్ట్రాల యువకులు

-

పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐ కార్యకలాపాల దర్యాప్తులో ఎన్ఐఏ దూకుడు పెంచింది. ఆ కేసులో ఇప్పటికే ఎన్ఐఏ అధికారులు పలువురిని అరెస్టు చేశారు. అయితే తాజాగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ముగ్గురు వ్యక్తులను వాంటెడ్ జాబితాలో చేర్చింది. జగిత్యాలలోని ఇస్లాంపురాకు చెందిన అబ్దుల్ సలీం, నిజామాబాద్‌లోని మల్లేపల్లికి చెందిన అబ్దుల్ ఆహద్ అలియాస్ ఎంఏ అహద్, ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఖాజా నగర్‌కి చెందిన షేక్ ఇలియాస్ అహ్మద్‌ను వాటెండ్ జాబితాలోకి చేర్చినట్లు ఎన్ఐఏ అధికారులు తెలిపారు. ఆ ముగ్గురు గురించి సమాచారం తెలిసినవారు 9497715294కు వాట్సాప్ ద్వారా సమాచారం అందించాలని కోరారు. ఆచూకి తెలిపిన వారికి భారీ పారితోషికం ఇవ్వనున్నట్టు ఎన్ఐఏ అధికారులు ప్రకటించారు.

ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని గుర్తించిన కేంద్రం గత సెప్టెంబరులో  పాపులర్ ప్రంట్ ఆఫ్ ఇండియా-పీఎఫ్ఐ పైనిషేధం విధించిన విషయం తెలిసిందే.  ఆ సమయంలో తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా సుమారు 100చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించి పలువురిని అరెస్టు చేశారు. అంతకుముందే పీఎఫ్ఐ కార్యకలాపాలపై నిజామాబాద్‌ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఎన్ఐఏ దాడులు నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version