ఇక ఇంటి వ‌ద్ద‌కే రానున్న TGSRTC కార్గో సేవ‌లు..!

-

ఆదాయాన్ని పెంచుకునేందుకు గాను కార్గో సేవ‌ల‌ను TGSRTC మ‌రింత‌గా విస్త‌రిస్తోంద‌ని ర‌వాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ తెలిపారు. అందులో భాగంగానే రాజ‌ధాని హైద‌రాబాద్ లో వేగ‌వంత‌మైన సేవ‌ల‌ను అందించేందుకు హోం డెలివ‌రీ సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్న‌ట్లు పేర్కొన్నారు. ఈ నెల 27 నుంచి హైద‌రాబాద్ లోని 31 ప్రాంతాల నుంచి హోం డెలివ‌రీ సేవ‌లు అందుబాటులో ఉంటాయ‌ని వివ‌రించారు.

TGSRTC లాజిస్టిక్స్ సెంట‌ర్స్ నుంచి హైద‌రాబాద్ లో ఎక్క‌డికైనా హోం డెలివ‌రీ చేయవ‌చ్చ‌ని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇంటి నుంచి ఇంటి వరకు సేవలు అందించేలా లాజిస్టిక్స్ విభాగాన్ని టీజీఎస్ఆర్టీసీ అభివృద్ధి చేస్తోంద‌ని తెలిపారు. ప్ర‌జ‌లంద‌రూ హోం డెలివ‌రీ స‌దుపాయాన్ని ఉప‌యోగించుకోవాల‌ని వినియోగ‌దారుల‌ను మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కోరారు. ఇక పార్శిళ్ల హోం డెలివ‌రీ చార్జీలు పరిశీలిస్తే.. 1 కేజీ పార్శిల్‌కు రూ.50, 5 కేజీల‌కు రూ.60, 10 కేజీల‌కు రూ.65, 20 కేజీల‌కు రూ.70, 30 కేజీల‌కు రూ.75.. ఇక 30 కంటే ఎక్కువ ఉంటె పైన పేర్కొన్న స్లాబ్‌ల ఆధారంగా ధ‌ర‌లు ఉంటాయి అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version