మహారాష్ట్ర తరహా దాడులు తప్పవు.. దుమారం రేపిన ఆ ఎమ్మెల్యే వ్యాఖ్యలు..

Join Our Community
follow manalokam on social media

బీజేపీ నేతలు, కేవలం రాజకీయ లబ్ధికోసమే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాట తీరు మార్చుకోకుండే నాలుక కోస్తామని తెలంగాణ మంత్రులు గంగుల కమలాకర్, ఇంద్రకరణ్‌ రెడ్డి, ఎమ్మెల్యే బాల్కసుమన్‌ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు భరోసా కల్పిస్తూ ముందుకు తీసుకెళ్తుంటే వారిని తప్పదోవ పట్టించేందుకు బీజేపీ నాయకులు యత్నిస్తున్నారని ఆరోపించారు. రైతులకు కావాలసిన డిమాండ్లు తీర్చాలని దిల్లీలో రైతన్నలు ఎముకలు కొరికే చలిలో రోడ్లపై నిద్రిస్తుంటే కేంద్రం మాత్రం చర్చల పేరిట సమయం వృథా చేస్తుందని దాని మూలంగా పలువురు రైతుల ప్రాణాలు పొట్టన పొట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ ఏ ప్రభుత్వం అమలు చేయలని సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టి నిరుపేదలకు అండగా నిలుస్తుంటే అది చూడలేక కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని హెచ్చరించారు.

వాటిపేర్లతో రెచ్చగొడుతూ..

బండి సంజయ్‌ ఇండియా పాకిస్తాన్‌ గుడులు, మసీదుల పేర్లతో యువతను రెచ్చగొడుతున్నారని బాల్కసుమన్‌ ఆరోపించారు. కరీంనగర్‌కు నాటి ఎంపీ వినోద్‌కుమార్‌ త్రిబుల్‌ ఐటీ తీసుకొస్తే దాన్ని కర్ణాటకలోని రాయచూర్‌కు తరలించారన్నారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న బండి సంజయ్‌ ఎందుకు ఆపలేకపోయారని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ పార్టీ, కేసీఆర్‌పై నోటికొచ్చినట్లు మాట్లాడితే ఎవరు ఊరుకోరని ‘మహారాష్ట్రలో శివసేన అనుచరుల తరహా దాడులు చేయాలని‘ టీఆర్‌ఎస్‌ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ వ్యాఖ్యాలు రాష్ట్రలో దుమారం రేపాయి. దీంతో ఇక రాజకీయ మాటల యుద్ధం మొదలుకానుంది.

TOP STORIES

సులభ్ కాంప్లెక్స్ లో మటన్ షాపు నిర్వహణ..!

మటన్, చికెన్ షాపులకు డిమాండ్ ఎక్కువనే చెప్పుకోవచ్చు. చుక్కా, ముక్కా లేనిదే కొందరి ముద్ద దిగదనే భావనలో బతికేస్తుంటారు. ఎన్ని బర్డ్ ఫ్లూలు వచ్చినా ఇంట్లో...