నల్గొండ జిల్లాలో టెన్త్ పేపర్ లీక్ అయిందని వార్తలు వస్తున్నాయి. నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్ లోని ఎస్ఎల్బీసీ బాలుర గురుకుల పాఠశాల సెంటర్లో తెలుగు పేపర్ లీక్ కలకలం రేపింది. దీంతో విద్యాశాఖ, పోలీసుల నిర్లక్ష్యం బయటపడిందని అంటున్నారు. నిన్న ఉదయం విద్యార్దులకు ప్రశ్నా పత్రం ఇచ్చిన 10 సెకన్ల వ్యవధిలోనే సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిందట ప్రశ్నాపత్రం.
పేపర్ లీక్ వ్యవహారంలో విద్యాశాఖ అధికారుల ప్రమేయం పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఉన్నాతాధికారులు. విషయం బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారట అధికారులు. గుట్టు చప్పుడు కాకుండా విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు.. ఎగ్జామ్ సెంటర్ లోకి మొబైల్ ఎలా వెళ్లిందనే దానిపై ఆరా చేస్తున్నారు. ప్రైవేట్ స్కూల్స్ తో విద్యాశాఖ అదికారులు కుమ్మక్కైనట్టు ఆరోపణలు వస్తున్నాయి. దీనిపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.