మాదాపూర్ డ్రగ్స్‌ కేసు.. సినీ దర్శకుడు, రచయిత అరెస్టు

-

హైదరాబాద్ మాదాపూర్ డ్రగ్స్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. నిందితులను విచారిస్తున్న పోలీసులకు కీలక విషయాలు తెలుస్తున్నాయి. ఈ విచారణలో తీగ లాగుతూ ఉంటే పోలీసులకు తెలుగు చిత్ర పరిశ్రమ డొంక కదులుతోంది. ఓవైపు మాదాపూర్ డ్రగ్స్ కేసు విచారణ ముమ్మరంగా సాగుతుంటే టాలీవుడ్ ఇండస్ట్రీ మత్తు గురించి మరో కీలక విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఈ డ్రగ్స్ కేసులో సినీ ఫైనాన్షియర్లు, మరికొందరి అరెస్టు మరవకముందే ఆ పరిశ్రమకు చెందిన మరో ఇద్దరు డ్రగ్స్‌ కేసులో పట్టుబడ్డారు. సినీ దర్శకుడు మంతెన వాసువర్మను మాదాపూర్‌ పోలీసులు ఈ నెల 5న అరెస్టు చేశారు. ఈ విషయం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇదే కేసులో సినీ రచయిత మన్నెరి పృథ్వీకృష్ణ అలియాస్‌ దివాకర్‌, పుణేకు చెందిన ఈవెంట్‌ నిర్వాహకుడు రాహుల్‌ అశోక్‌ తెలోర్‌ గత జూన్‌లో అరెస్టయ్యారు.

పోలీసుల సమాచారం మేరకు.. ముంబయికి చెందిన విక్టర్‌, పుణేలో ఉంటున్న రాహుల్‌ అశోక్‌ తెలోర్‌ పరిచయస్థులకు డ్రగ్స్‌ విక్రయిస్తుంటారు. ఈ క్రమంలో రాహుల్‌, విక్టర్‌ నుంచి నార్సింగికి చెందిన పృథ్వీకృష్ణ డ్రగ్స్‌ కొనుగోలు చేసి వినియోగించేవాడు. విషయం తెలుసుకున్న సైబరాబాద్‌ ఎస్‌వోటీ పోలీసులు గత జూన్‌ 19న పృథ్వీకృష్ణ, రాహుల్‌ను అదుపులోకి తీసుకుని వీరి నుంచి 70 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకున్నారు. వారిద్దరు ఇచ్చిన సమాచారంతో ‘బస్తీ’ చిత్ర దర్శక, నిర్మాతమంతెన వాసువర్మ కూడా డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు తేలడంతో ఈ నెల 5న వాసువర్మను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version