రేపు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు

-

తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి గురువారం రోజున ప్రమాణ స్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం రోజున స్టేడియం పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి.

ట్రాఫిక్‌ ఆంక్షలతో వాహనాలు దారి మళ్లించడం ద్వారా రవీంద్ర భారతి, ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ కాంప్లెక్స్, బషీర్‌బాగ్, ఎస్బీఐ గన్‌ఫౌండ్రి, అబిడ్స్ సర్కిల్, లిబర్టీ సర్కిల్‌, హిమాయత్‌నగర్, అసెంబ్లీ, ఎంజే మార్కెట్ కూడళ్ల వద్ద వాహనాలు పెద్ద ఎత్తున బారులు తీరే అవకాశం ఉందని ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఎల్బీ స్టేడియానికి వచ్చే మార్గాల్లో కాకుండా ప్రత్యామ్నాయ దారులు ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

ట్రాఫిక్‌ ఆంక్షలు ఇలా…

  • బషీర్‌బాగ్‌ నుంచి ఎల్బీ స్డేడియం వైపు వచ్చే వాహనాలు కింగ్‌ కోఠి వైపు మళ్లింపు.
  • సుజాత స్కూల్‌ నుంచి ఖాన్ లతీఫ్ ఖాన్ బిల్డింగ్ వైపు వచ్చే వాహనాలు నాంపల్లి వైపు మళ్లింపు.
  • పబ్లిక్ గార్డెన్ నుంచి ఎల్బీ స్టేడియం వైపు వచ్చే వాహనాలను నాంపల్లి వైపు మళ్లింపు.
  • ఎస్‌బీఐ గన్‌పౌండ్రి నుంచి వచ్చే వాహనాలు చాపెల్ రోడ్డు వైపు మళ్లింపు.

Read more RELATED
Recommended to you

Exit mobile version