సచివాలయం ప్రారంభోత్సవ వేళ.. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభోత్సవానికి ముస్తాబవుతోంది. ఏప్రిల్ 30వ తేదీన అట్టహాసంగా సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేథ్యంలో రేపు హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. సచివాలయం వైపు వచ్చే వాహనాలను పోలీసులు దారి మళ్లించనున్నారు. ఆదివారం ఉదయం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరుకు ట్యాంక్ బండ్ వైపు వచ్చే వాహనాలను అనుమతించమని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు.

ఆదివారం ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబినీ పార్క్ సైతం మూసివేయనున్నట్లు ట్రాఫిక్‌ పోలీసులు తెలిపారు. ఖైరతాబాద్ జంక్షన్ నుంచి ఎన్.టి.ఆర్ మార్గం, తెలుగు తల్లి జంక్షన్ వైపు వెళ్లే వాహనాలను ట్యాంక్ బండ్ వైపు అనుమతించనున్నామని పేర్కొన్నారు. పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు..  చింతల్‌ బస్తీ నుంచి వచ్చే వాహనాలను నెక్లెస్ రోడ్డు వైపు అనుమతించనున్నామని వివరించారు.

ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి వచ్చే వాహనాలను ట్యాంక్‌బండ్, రాణిగంజ్, లిబర్టీ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్, అంబేడ్కర్​ విగ్రహం, ట్యాంక్‌ బండ్ వైపు అనుమతిస్తారు. కట్ట మైసమ్మ జంక్షన్, లోయర్ ట్యాంక్‌బండ్ వైపు వచ్చే వాహనాలను తెలుగు తల్లి ఫ్లైఓవర్‌ పై నుంచి అనుమతిస్తారు. బీఆర్‌కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చే వాహనాలను అనుమతిస్తామని వివరించారు. తెలుగు తల్లి జంక్షన్ వద్ద ఇక్బాల్ మినార్ జంక్షన్ వైపు వాహనాలు మళ్లించబడవని వెల్లడించారు. ఖైరతాబాద్‌ గణేశ్‌ మార్గం నుంచి వచ్చే వాహనాలను ఐమాక్స్, నెక్లెస్ రోడ్డు వైపు వచ్చే ట్రాఫిక్.. బడా గణేష్ వద్ద రాజ్‌దూత్ లేన్ వైపు మళ్లిస్తామని ట్రాఫిక్‌ పోలీసులు వివరంగా చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version