తెలంగాణ రాష్ట్ర ప్రజలతో పాటు జాతీయ రాజకీయాల్లో మునుగోడు ఉప ఎన్నికకు ప్రత్యేక స్థానం ఉంది. తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, అధికార టీఆర్ఎస్ పార్టీలకు ఈ ఉప ఎన్నిక ఎంతో మైలేజ్ ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో మునుగోడులో ప్రచారాలు జోరుమీదున్నాయి.
అయితే.. ఈ ఉప ఎన్నిక నేపథ్యంలో.. జంపింగ్ ఎక్కువ అయ్యాయి. నిన్న టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ దెబ్బ నుంచి కోలుకోక ముందే.. టీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.
మునుగోడు ఉప ఎన్నికలో కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం బ్రాహ్మణపల్లి గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షురాలు మండల ప్రధాన కార్యదర్శి మూదాం స్వప్న నామినేషన్ దాఖలు వేసిన విషయం బయటకు వచ్చింది. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజైన శుక్రవారం ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. టిఆర్ఎస్ సొంత పార్టీ నాయకురాలు మునుగోడులో నామినేషన్ వేయడం ఆసక్తికరంగా మారింది. అయితే… ఆమె నామినేషన్ ను విత్ డ్రా చేయించేందుకు టీఆర్ఎస్ నేతలు తంటాలు పడుతున్నారు.