శంషాబాద్ ఘటన పై స్పందించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

-

తెలంగాణ రాష్ట్రంలో ఈ మధ్య కాలంలో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ దేవాలయం వద్ద దాడులు.. అక్కడ సమావేశం తదితర సంఘటనలు చోటు చేసుకున్న విషయం తెలిసిదే. తాజాగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన శంషాబాద్ ఎయిర్ పోర్టు కాలనీలోని హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. ఆలయానికి వచ్చిన అయ్యప్ప భక్తులు ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు.

పోలీసులు నిందితులను పట్టుకునే పని ఉన్నారు. శంషాబాద్ హనుమాన్ దేవాలయంలో విగ్రహాల ధ్వంసాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. దుండగులను గుర్తించి వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓ వర్గానికి కొమ్ము కాస్తుందని దుయ్యబట్టారు. ఓట్ల కోసమే ప్రభుత్వం సైలెంట్ గా ఉంటుందని విమర్శించారు. ఈ విగ్రహ ధ్వంసాలపై సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Exit mobile version