ప్రాణాలతో పోరాడి వాంకిడి పాఠశాల విద్యార్థిని శైలజ మృతి

-

కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్ లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ (16) తిరిగిరాని లోకాలకు వెళ్లింది. కొద్ది రోజులుగా నిమ్స్ ఆసుపత్రిలో పోరాడుతున్న ఆమె ఇవాళ మరణించింది. కొమురం భీం జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో ఈనెల 3న ఫుడ్ పాయిజన్ అయింది. స్కూల్ లో భోజనం చేసిన విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మహాలక్ష్మీ, జ్యోతి, శైలజను హైదరాబాద్  నిమ్స్ కు తరలించారు. వీరిలో మహాలక్ష్మీ, జ్యోతి కోలుకోగా శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించింది.

ఈనెల 11 నుంచి శైలజను వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించడంతో శైలజ ఇవాళ మరణించినట్టు డాక్టర్ చెప్పారు. బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ.. శైలజ మృతి పట్ల ప్రభుత్వం చేసిన హత్య అని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్లక్ష్యమే అని మండిపడ్డారు. బాధిత కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version