యువతి ప్రాణాలు తీసిన యువకుడి వాట్సాప్ స్టేటస్..

-

ఓ యువకుడి తప్పిదం యువతి ప్రాణం మీదికి తెచ్చింది తల్లిదండ్రులకు కడుపుకోత ను మిగిల్చింది. వాట్సాప్ స్టేటస్ పెట్టడం చాలా మందికి సరదా..అవే స్టేటస్ లు కొంతమంది ప్రైవసీకి ఇబ్బందిగా మారుతుంటాయి. ఒక్కోసారి ప్రాణాల మీదకు తెచ్చి పెడుతుంటాయి. మంచిర్యాల జిల్లా లో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఓ యువకుడు పెట్టిన వాట్సాప్ స్టేటస్ మరో అమ్మాయి చావుకు కారణమయ్యింది. తాండూర్ మండలం అచ్చులాపుర్ లోని కొమ్ముగూడెం గ్రామంలో అజయ్ అనే యువకుడు నివసిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన ఒక అమ్మాయి హైదరాబాదులో పాలిటెక్నిక్ మొదటి సంవత్సరం జరుగుతుంది.

 

ఉగాది పండుగకు ఇంటికి వచ్చిందిి ఆ అమ్మాయి. ఆమె ఇంటి ఎదురుగా ఉన్న అజయ్ తో ఫోటోలు దిగింది. ఆ ఫోటోలను స్టేటస్ లో పెట్టుకున్నాడు. ఈ విషయం అమ్మాయి తల్లిదండ్రులకు తెలియడంతో…వాట్సాప్ లో పెట్టిన ఫోటోలు తీసి వేయాలని కోరారు. కానీ అజయ్ ఫోటోలు తొలగించకుండా ఫోన్ స్విచాఫ్ చేశాడు. దీంతో మనస్తాపానికి గురైన గీత బుధవారం ఇంట్లోనే పురుగుల మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు బెల్లంపల్లి ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు.అజయ్ వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని చనిపోయిన యువతి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మృతురాలి తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ కిరణ్ కుమార్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version