హైదరాబాదీ శ్రీమంతులు వీరే..!

-

హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2021లో హైదరాబాద్‌కు చెందిన 10 మంది బిలియనీర్లకు చోటుదక్కింది. అంతేకాదు ఈ ఏడాది జనవరి 15 నాటికి వీరందరి సంపంద రూ.1,65,900 కోట్లకు చేరింది. అయితే ఇందులో ఏడుగురు ఫార్మా రంగానికి చెందిన వారే కావటం విశేషం. 2020లో భారత్‌లో కొత్తగా 40 మంది బిలియనీర్లు చేరారని ధనవంతులు జాబితాలో వెల్లడైంది. అయితే మంగళవారం విడుదలైన వివరాలను బట్టి మన దేశంలో 177 మంది బిలియనీర్లున్నట్లు బయటపడింది. ఈ ఏడాది జనవరి 15 నాటికి దేశంలోని వ్యక్తులు, కుటుంబాల సంపద ఆధారంగా భారతీయ జాబితాను హురున్‌ రూపొందించింది.

హైదరబాదీ కుబేరులు
హైదరబాదీ కుబేరులు

ఇందులో రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అధినేత ముకేశ్‌ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. అంబాని సంపద విలువ రూ.6.09 లక్షల కోట్ల (83 బిలియన్‌ డాలర్లు)పైనే ఉంటుంది. రెండో స్థానంలో అదానీ గ్రూప్‌ అధిపతి గౌతమ్‌ అదానీ ఉన్నారు. 2020లో అంబానీ సంపద 24 శాతం ఎగబాకింది. అదానీ కూడా ఈసారి 20 స్థానాలు ఎగిసి అంతర్జాతీయంగా 48వ స్థానంలో నిలిచారు. ఆయన సోదరుడు వినోద్‌ అదానీ సంపద 128 శాతం పెరిగి రూ.71,912.4 కోట్లకు చేరింది. ఐటీ రంగ కుబేరుల్లో శివ్‌ నాడార్‌ మొదటి స్థానంలో ఉండగా, తర్వాతి స్థానాల్లో అజీమ్‌ ప్రేమ్‌జీ, ఎస్‌ గోపాలకృష్ణన్‌, ఎన్‌ఆర్‌ నారాయణ మూర్తి ఉన్నారు.

హురున్ బిలియనీర్లలో హైదరబాదీల జాబితా..
1. మురళీ దివీ కుటుంబం, దీవీస్ లాబోరేటరీస్ సంపద రూ.54,100 కోట్లు
2. రాంప్రసాద్‌ రెడ్డి కుటుంబం, అరబిందో ఫార్మా, సంపద రూ.22,600 కోట్లు
3. పార్థసారధి రెడ్డి కుటుంబం, హెటిరో డ్రగ్స్, సంపద రూ.16,000 కోట్లు
4. సతీష్‌ రెడ్డి కుటుంబం, డాక్టర్ రెడ్డీస్, సంపద రూ.12,800 కోట్లు
5. జీవీ ప్రసాద్‌ జీ అనురాధ , డాక్టర్ రెడ్డీస్, సంపద 10,700 కోట్లు
6. పీ.పిచ్చిరెడ్డి మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా, సంపద రూ.10,600 కోట్లు
7. జూపల్లి రామేశ్వరరావు, మైం హోం ఇండస్ట్రీస్ సంపద రూ.10,500 కోట్లు
8. పీవీ కృష్ణా రెడ్డి, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ ఫ్రా, సంపద రూ.10,200 కోట్లు
9. సత్యనారాయణ రెడ్డి కుటుంబం, ఎంఎస్‌ఎస్ లాబొరేటరీస్, సంపద రూ.9,800కోట్లు
10. వీసీ నన్నపనేని, నాట్కో ఫార్మా, సంపద రూ.8600 కోట్లు

Read more RELATED
Recommended to you

Latest news