ఉత్తరాధిలో తెలుగు సైన్ బోర్డులు.. పర్యాటకుల హర్షం

-

రెండు తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది పర్యాటకులు ఏమాత్రం కొంచెం గ్యాప్ దొరికిన కాశీ, బద్రీనాధ్ వంటి యాత్రలకు వెళ్తుంటారు. చార్‌ధామ్‌తో పాటే ఇటీవల అయోధ్య రామమందిరంను కూడా చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.ఈ క్రమంలోనే తెలుగు వారికి అక్కడ ఇబ్బంది కలగకుండా.. ప్రధాన రహదారులపై దారులను సూచించే సైన్ బోర్డులపై ఇంగ్లీష్,హిందీ భాషలతో పాటు తెలుగును చేర్చారు.

దీంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే తెలుగు పర్యాటకులకు ఇది ఎంతగానో సాయం చేయనుంది. ప్రయాగ్ రాజ్‌లోని అనేక ప్రాంతాల్లోనూ ఇదే విధంగా తెలుగు సైన్ బోర్డులను ఏర్పాటు చేశారు. ఉత్తరాధిలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఇకపై తెలుగు సైన్ బోర్డులు దర్శనం ఇవ్వనున్నాయి. యూపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.నార్త్, సౌత్ అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కేంద్రం ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version