బెడ్లు ఖాళీ చేసేందుకు ఆ వైద్యుడు కరోనా పేషంట్లను చంపేశాడు..!

-

వైద్యుడు దేవుడితో సమానం అంటారు. అలాంటి వైద్యవృత్తికే మచ్చ తెచ్చాడో ఓ వైద్యుడు. కరోనా సోకి ఆస్పత్రులకు వచ్చే వారికి ప్రాణం పోయాల్సిన అతడు, రెండు నిండు ప్రాణాలను పొట్టనబెట్టుకున్న దుర్గటన ఇటలీలో జరిగింది. ఇటలీ లాంబర్డిలోని ఓ ఆస్పత్రి కోవిడ్‌ ఎమర్జెన్సీ వార్డుకు డాక్టర్‌ కార్లొ మోస్కా ఇన్‌చార్జ్‌గా బాధ్యతులు నిర్వర్తిస్తున్నాడు. అసలే కరోనా మూలంగా ఆస్పత్రిలో రోగుల సంఖ్య పెరుగుతుండటంతో బెడ్లన్నీరోగులతో నిండిపోయాయి.

దీంతో ఆ వైద్యుడు కొంతమందిని చంపేస్తే కొన్ని బెడ్లు ఖాళీ అవుతాయని భావించాడు. అందుకోసం వయస్సు ఎక్కువగా ఉన్న వారిని ఎంచుకున్నాడు. అదే వార్డులో కరోనా చికిత్స పొందుతున్న నటాలే బస్సీ (61), ఏంజెలో పలెట్టి (80) అనే ఇద్దరికి చంపాలని నిర్ణయించి, చికిత్స పేరుతో వారికి మత్తుమందుతో, పాటు కండరాల నొప్పులకు వాడే మందులను అధిక మోతాదులో ఇవ్వడంతో వారు గిలగిల కొట్టుకుంటు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. మార్చిలో జరిగిన ఘటన ఇటీవల పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ తతాంగం అంతా ఆ వైద్యుడు ఆస్పత్రిలో పనిచేసే నర్సులతో చేసిన చాటింగ్‌ బయటపడింది.

చాటింగ్‌లో ఇలా..

‘‘కేవలం బెడ్లు ఖాళీ చేయడం కోసం కోసం నేను ఇలాంటి చేయలేను’, ఇది చాలా మూర్ఖత్వపు చర్య’’ అంటూ నర్సులు మెసేజ్‌లలో అతగాడికి హెచ్చరించినట్లు ఉన్నాయి. అయినా అవేమీ పట్టించుకోని డాక్టర్‌ కార్లొ మోస్కా, స్వయంగా అతడే ఆ దుశ్చర్యకు పాల్పడ్డాడు. కరోనా రోగులకు మందులు, ఇంజక్షన్లు చేసేటప్పుడు అక్కడ ఉండే నర్సులు, ఇతర సిబ్బందిని బయటకు పంపేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో అదే ఆస్పత్రిలో మరణించిన మరో ముగ్గురు కరోనా రోగుల చావుకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కావాలనే కరోనా రోగుల ప్రాణాలు తీశాడనే ఆరోపణలతో అతడిని విధుల నుంచి తొలగించారు. అయితే.. నేను ప్రాణాలు పోసేవాడినే.. కానీ.. ప్రాణాలు తీయం ఏంటని సదరు వైద్యుడు చెప్పడం కొస మెరుపు.

Read more RELATED
Recommended to you

Exit mobile version