నారాయణగూడ పెట్రోల్ దాడి కేసులో మృతుల సంఖ్య నాలుగుకి చేరింది. చిక్కడపల్లి మున్సిపల్ మార్కెట్ వద్ద ఉండే రాగుల సాయి అలియాస్ నాగుల సాయి కి హారతితో ఎనిమిదేళ్ల కిందట వివాహమైంది. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతూ ఉండే సరికి సర్ది చెప్పడానికి వచ్చాడు ఆరతి సోదరుడు. అయితే హారతి సోదరుడు జితేందర్ పై పెట్రోల్ పోసినిప్పంటించడానికి ప్రయత్నించాడు సాయి.
దీంతో చిక్కడపల్లి పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకి పంపించారు. సాయి జైలులో ఉండగానే ఆరతి నారాయణగూడ ఫ్లైఓవర్ కింద పూల వ్యాపారం చేసే నాగరాజును పెళ్లి చేసుకుంది. వీరికి పది నెలల కుమారుడు విష్ణు ఉన్నారు. ఇక జైలు నుండి విడుదలైన నాగుల సాయి తన భార్య మరో వ్యక్తితో ఉంటుందని తెలిసి.. నాగరాజు, కొడుకు విష్ణు ని ఎత్తుకొని ఉన్న ఆరతిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
వారిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించగా విష్ణు, నాగరాజు మృతి చెందారు. అయితే తాజాగా ఆరతి గర్భంలో ఉన్న ఐదు నెలల పసికందు మృతి చెందింది. దీంతో చికిత్స పొందుతూ ఆరతి కూడా మృతి చెందింది. దాడికి పాల్పడిన నాగులు సాయి తో పాటు సహకరించిన రాహుల్ ని అరెస్ట్ చేసి చంచల్గూడా జైలుకు తరలించారు పోలీసులు.