భారత్ బయోటెక్ మొదటి టీకా వేయించుకున్న ఆరోగ్య శాఖ మంత్రి..!

ప్రస్తుతం శరవేగంగా కరోనా వైరస్ వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తుంది భారత్ బయోటెక్ ప్రస్తుతం భారతీయుల అందరి ఆశలు అన్నీ కూడా ఆ వ్యాక్సిన్ పైనే ఉన్నాయి. కాగా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాక్జిన్ ప్రస్తుతం మూడవదశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ లో భాగంగా మొదటి డోస్ హర్యానాకు చెందిన ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ తీసుకున్నారు .

కరోనా వైరస్ పై ప్రజల్లో మరింత నమ్మకాన్ని అవగాహన కలిగించేందుకు ఎంతో మంది ప్రజాప్రతినిధులు మొదటి డోస్ తీసుకునేందుకు ముందుకు వస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల కొవాక్జిన్ మూడవదశ ట్రయల్స్ లో భాగంగా అంబాల లోని హాస్పిటల్ లో హర్యానా ఆరోగ్య శాఖ మంత్రి అనిల్ విజ్ కోవిడ్ టీకా వేయించుకున్నారు. వాలంటీర్ రూపంలో టీకా వేయించుకుంన్న ఆరోగ్య శాఖ మంత్రి ప్రజల్లో నమ్మకం కలిగించేందుకు టీకా వేయించుకున్న ట్లు తెలిపారు.