మహారాష్ట్రలో అన్లాక్ మార్గదర్శకాల లో భాగంగా అన్ని రకాల కార్యకలాపాలు ప్రారంభించిన మహా రాష్ట్ర ప్రభుత్వం… ఆలయాలు ప్రార్థన మందిరాలు తెరుచుకునేందుకు మాత్రం అనుమతి ఇవ్వలేదు అనే విషయం తెలిసిందే. ఆలయాలు ప్రార్థన మందిరాలు తెరుచుకుంటే ప్రజలు గుమిగూడి కరోనా వైరస్ వ్యాప్తి మరింత వేగంగా జరిగే అవకాశం ఉందని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఇక ఈ విషయంపై మహారాష్ట్ర గవర్నర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. ఇక మహారాష్ట్ర గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా… గవర్నర్ అలాంటి పదజాలాన్ని వాడకుండా ఉండాల్సింది అని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఇటీవల ఇదే విషయంపై స్పందించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఒక గవర్నర్ స్థానంలో ఉండి చేసిన వ్యాఖ్యలను ఏకంగా కేంద్ర మంత్రులు సైతం తప్పుబట్టారు అంటే ఒకవేళ గవర్నర్ కు ఆత్మాభిమానం ఉంటే వెంటనే ఆయన పదవికి రాజీనామా చేసి తప్పుకుంటారు అంటూ వ్యాఖ్యానించారు. గవర్నర్ లేఖలో ఉపయోగించిన పదజాలం సరిగా లేదని కేంద్ర మంత్రి స్వయంగా చెప్పినప్పటికీ గవర్నర్ ఆత్మాభిమానం లేని వ్యక్తి లాగా పదవికి రాజీనామా చేయడం లేదు అంటూ వ్యాఖ్యానించారు శరత్ పవర్.