ఝార్ఖండ్ ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం… లీటర్ పెట్రోల్‌పై రూ. 25 త‌గ్గింపు…

-

వాహనదారులకు ఝార్ఖండ్‌ సర్కార్‌ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పెట్రోల్‌ ధరలను తగ్గిస్తూ.. సంచలన నిర్ణయం తీసుకుంది ఝార్ఖండ్‌ సర్కార్‌. అయితే.. అన్ని రాష్ట్రాలాగా… రూ. 5, రూ. 6 కాకుండా.. ఏకంగా.. లీటర్‌ పెట్రోల్‌ పై రూ.25 తగ్గిస్తూ.. నిర్ణయం తీసుకుంది హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌. ఇవాళ భేటీ అయితే.. ఝార్ఖండ్‌ కేబినేట్‌ ఈ నిర్ణయం తీసుకుని.. అందరికీ షాక్‌ ఇచ్చింది.

ఇవాళ తీసుకున్న ఈ నిర్ణయం వచ్చే నెల 26 తేదీ నుంచి అమలు అవుతాయని ఝార్ఖండ్‌ ముఖ్య మంత్రి హేమంత్‌ సోరెన్‌ ప్రకటన చేశారు. ఇక హేమంత్‌ సోరెన్‌ సర్కార్‌ తీసుకున్న ఈ నిర్ణయం తో.. వాహనదారులకు భారీ ఊరట కలుగనుంది. అటు ఝార్ఖండ్‌ వాహనాదారులు కూడా హేమంత్‌ సోరెన్‌ నిర్ణయం పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.

కాగా… ఇప్పటికే ఒడిషా, ఢిల్లీ, కర్ణాటక, అస్సాం లాంటి చాలా రాష్ట్రాలు.. పెట్రోల్‌ మరియు డీజిల్‌ పై ధరలనున తగ్గిస్తూ… నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే.. అన్ని రాష్ట్రాల కంటే.. ఝార్ఖండ్‌ మాత్రం రూ. 25 తగ్గించడం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version