సినీ ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా ఆర్జీవీ ఉండాలి : డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి

-

తెలుగు సినీ ఇండస్ట్రీకి తాను పెద్ద‌గా ఉండాలేన‌ని మెగాస్టార్ చిరంజీవి ఆదివారం ప్రక‌టించిన విష‌యం తెలిసిందే. అయితే మెగా స్టార్ చిరంజీవి చేసిన ఇండస్ట్రీ పెద్ద వ్యాఖ్య‌లపై చాలా మంది స్పందిస్తున్నారు. కొంత మంది చిరంజీవి మంచి నిర్ణ‌యం తీసుకున్నార‌ని ట్వీట్ చేస్తున్నారు. మ‌రి కొంద‌రు మాత్రం మెగాస్టార్ చిరంజీవి లాంటి వారే ఇండ‌స్ట్రీ పెద్ద‌గా ఉండాల‌ని కామెంట్ చేస్తున్నారు. అయితే టాలీవుడ్ డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి ఇండ‌స్ట్రీ పెద్ద విష‌యంలో ఒక కొత్త అంశాన్ని తీసుకువ‌చ్చారు.

“మా బాస్ (రాంగోపాల్ వర్మ) ని ఇండస్ట్రీకి పెద్ద దిక్కు గా చూడాలని నా కోరిక” అంటూ ట్వీట్ చేశాడు. అంతే కాకుండా సామీ మీరు రావాలి సామీ అంటూ క్యాప్ష‌న్ కూడా జోడించాడు. అయితే డైరెక్ట‌ర్ అజ‌య్ భూప‌తి చేసిన ట్వీట్ పై మిశ్ర‌మ స్పంద‌న వ‌స్తుంది. కొంత మంది వ‌ద్దు సామీ ఆయ‌న ఇండస్ట్రీ పెద్ద‌గా ఉంటే క‌ష్టం సామీ అంటూ ట్వీట్ చేస్తున్నారు. అలాగే ఈ ఆలోచ‌ని ఇన్ని రోజుల రాలేదే అంటు కామెంట్స్ చేస్తున్నారు. నిజంగానే వివాదాస్ప‌ద ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెలుగు సినీ ఇండస్ట్రీకి పెద్ద‌గా ఉంటే ఎలాంటి ప‌రిస్థితులు ఉంటాయో..

Read more RELATED
Recommended to you

Exit mobile version