పోసాని కృష్ణ మురళి అరెస్టుపై వైసీపీ సంచలన పోస్ట్

-

వైసీపీ పార్టీ సంచలన పోస్ట్ పెట్టింది. వైసీపీ నేత పోసాని కృష్ణమురళి అరెస్టుపై ఆ పార్టీ సోషల్ మీడియా వేదికగా స్పందించింది. ‘చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్‌ను ప్రశ్నించాడనే కారణంతో కక్ష సాధిస్తూ కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టింది.

The party reacted to the arrest of YCP leader Posani Krishnamurali through the social media platform

పోసానికి ఆరోగ్యం బాలేదని అతని సతీమణి చెప్తున్నా దురుసుగా ప్రవర్తిస్తూ గచ్చిబౌలిలోని ఆయన నివాసం నుంచి పోలీసులు తీసుకెళ్లారు. ఇలా ఇంకెంత కాలం కక్ష సాధింపు రాజకీయాలు చేస్తావ్ బాబు? ’అని ట్వీట్ చేసింది.

కాగా, పోసాని కృష్ణమురళిని నిన్న అర్ధరాత్రి పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాదులో ఉన్న పోసాని కృష్ణ మురళిని… ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. శివరాత్రి పండుగ అని చూడకుండా… దౌర్జన్యంగా పోసాని కృష్ణ మురళిని ఏపీకి తరలించారు పోలీసులు. ఈ తరుణంలోనే ఇవాళ.. అన్నమయ్య జిల్లా ఓబులవారి పల్లెకు సినీ నటుడు పోసాని కృష్ణ మురళిని తరలించారు. నిన్న రాత్రి గచ్చిబౌలిలో పోసానిని అరెస్టు చేసి నేరుగా అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తరలించడం జరిగింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version