ఓలా బైకులకు సంబంధించిన ఫిర్యాదులు క్రమంగా పెరుగుతున్నాయి. సర్వీసుకు సంబంధించి సమస్యలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో వినియోగదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.బ్యాటరీలు పేలిపోవడం, త్వరగా డిశ్చార్జి అవ్వడం, పదే పదే రిపేర్లు వస్తుండటంతో కస్టమర్లు ఓలా యాజమాన్యం పై సీరియస్ అవుతున్నారు.
షోరూంల చుట్టూ ఎన్నిమార్లు తిరిగినా తమ సమస్యను పరిష్కరించలేదని ఓ వ్యక్తి తన బైకును తగలబెట్టాడు. ఈ ఘటన చెన్నై – అంబత్తూరులో ఉన్న OLA షోరూమ్ వద్ద శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. అతడు ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఓలా వాళ్ళు సమస్యను పరిష్కరించలేదని విసుగు చెందిన అతను ఇలా చేశాడు. నడిరోడ్డుపై బైకు తగులపెట్టడంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.